ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నివాసంలో ఏసీబీ దాడులు
16-06-2026 10:23 AM
హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులపై చర్యలను కొనసాగిస్తూ, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ ఎస్. నరహరికి(Lands and Survey Deputy Director Narahari) చెందిన ఇళ్లు, బంధువుల ఇళ్లు సహా దాదాపు 11 ప్రాంతాల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (Anti Corruption Bureau) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నరహరి కార్యకలాపాలకు సంబంధించి ఏసీబీకి (ACB) పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో, ఆయన నివాసంతో పాటు పాతబస్తీలోని ఛత్రినాక, నారాయణగూడ వంటి ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఏసీబీ డీఎస్సీ శ్రీధర్ నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి.






