25 July, 2026 | 11:41 AM

పకడ్బందీగా రీ సర్వే చేపట్టాలి

25-07-2026 10:45 AM

అదనపు కలెక్టర్ డేవిడ్ 

బెజ్జూర్, జూలై 25 (విజయక్రాంతి):  జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్  శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగ తనిఖీ నిర్వహించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు భూ వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా భూ సర్వే నిర్వహించాలని సూచించారు.అనంతరం మండల కేంద్రంలోని పౌర సరఫరాల శాఖ గోదామును పరిశీలించి బియ్యం నిల్వలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామ్మోహన్ రావు, డిప్యూటీ తహసీల్దార్ భీమ్లా నాయక్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు తిరుపతి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.