15 August, 2026 | 2:21 PM

స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించిన తెలుగు దేశం పార్టీ

15-08-2026 01:10 PM

ముకరంపుర, ఆగస్టు 15(విజయక్రాంతి): 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియ జేస్తూ కరీంనగర్ తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ నియోజక వర్గ కన్వీనర్  వంచ శ్రీనివాస్ రెడ్డి పార్లమెంట్ నియోజక వర్గ కార్యాలయంలో జాతీయ జెండా ఎగుర వేసి "స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన సమర యోధులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం  మాట్లాడుతూ "దేశభక్తి, జాతీయ సమైఖ్యత, దేశం పై మమకారాన్ని చాటుతూ, ప్రతి ఒక్కరు జాతీయ జెండా పట్ల గౌరవాన్ని, దేశ భక్తిని ,చాటుతూ నూతన ఉత్సహంతో ఈ వేడుకల్లో పాల్గొని స్వాతంత్య్రం సాధించుటకు మహనీయులు చేసిన త్యాగలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే భాద్యత మనందరిపైన ఉందని వంచ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.