15 August, 2026 | 3:05 PM

ఘనంగా మిస్ట్ కళాశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 01:09 PM

సత్తుపల్లి ఆగస్టు15(విజయక్రాంతి): స్థానిక మదర్ తెరిసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారనాడు ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కొత్తూరు. సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ నాయకులను స్మరిస్తూ,వారి పటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భం లో ఆయన కళాశాలలో వివిధ విభాగాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని,విద్యార్థులకు ,అధ్యాపక బృందానికి 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ 80 సంవత్సరాల స్వాతంత్ర్య భారత దేశంలో మనము వివిధ రంగాలలో సాధించిన స్వయం సమృద్ధిని, ఆర్థిక ప్రగతిని వివరించారు.అదేవిధంగా బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర్యం సాధించి అమరులైన,మన జాతీయ నాయకులైన మహాత్మా గాంధీ ,పండిట్ జవహర్లాల్ నెహ్రూ,సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్ మొదలైన నాయకులను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు. అదే విధంగా భారతదేశ ప్రగతి నేటి యువతపై ఆధారపడి ఉన్నదని, అందువలన విద్యార్థిని మరియు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి,తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు ప్రతిష్టలను తేవాలన్నారు.

అదేవిధంగా కళాశాల జాయింట్ సెక్రటరీ డాక్టర్ కందిమళ్ళ కృష్ణారావు గత నాలుగు దశాబ్దాలుగా విద్యారంగానికి,సామాజిక సేవకు మరియు దాతృత్వ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అందువలన ఆయన సేవలను గుర్తిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సత్తుపల్లి మున్సిపాలిటీ కో- ఆప్షన్ సభ్యునిగా  నామినేట్ చేయడం జరిగింది.ఈ సందర్భంలో కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చలసాని హరి కృష్ణ ,మదర్ తెరిసా విద్యాసంస్థల ప్రెసిడెంట్ చలసాని సాంబశివరావు,వైస్ ప్రెసిడెంట్ కొత్తూరు ప్రభాకర్ రావు,జాయింట్ సెక్రటరీ డాక్టర్ కందిమళ్ల కృష్ణారావు, డైరెక్టర్లు కంచర్ల సత్యనారాయణ, కొత్తూరు సత్యనారాయణ మదర్ తెరిసా బి.ఎడ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్విఆర్ దీక్షితులు,ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి. ఉదయ్ కిరణ్ భార్గవ్, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. వి.రామచంద్రరావు, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె.రామకృష్ణారెడ్డి వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, జాతీయ నాయకుల పటాలకు పుష్పాంజలి ఘటించారు.