సెయింట్ పాల్స్ నందు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
భద్రాచలం,(విజయక్రాంతి): స్థానిక సెయింట్ పాల్స్ ప్రాంగణంలో 13వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ప్రధానోపాధ్యాయురాలు డాక్టర్ కే అబ్రహం, డాక్టర్ కే రాధా మంజరి మరియు ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులు వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు ఉపాధ్యాయులు వారి సందేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యతను వివరించారు.
అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ మరియు ప్రధానోపాధ్యాయురాలు అయిన డాక్టర్ కె అబ్రహం మరియు డాక్టర్ కే రాధా మంజరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎందరో మహానీయుల త్యాగాలు ఉన్నాయని వారి త్యాగాలు వృధా కాకుండా ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తూ తమ వంతుగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు






