28 April, 2026 | 1:17 PM

Breaking News

పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు   •   మహబూబాబాద్‌లో దారుణం.. కుమారులను చంపి తండ్రి ఆత్మహత్య   •   గూగుల్‌ రాక ఏపీకి గేమ్‌ ఛేంజర్‌   •   విశాఖపట్నం ఇక నుంచి AI పట్నం.. దక్షిణాదిపై అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు   •   ప్రజల ఆశీస్సులతో మళ్ళీ పునః జన్మ దక్కింది   •   క్రేన్‌ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి వివేక్‌   •   పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై నిరసన.. ఆటోను తాడుతో లాగిన సీఐటీయూ నాయకులు   •   పెట్రోల్, డీజిల్ సరఫరాపై పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన   •   ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ.. యువకులతో పోటీపడి గోల్స్..!   •   పెట్రోల్, డీజిల్ ఉన్న.. బంకుల ముందు క్యూలైన్లు   •  

పెట్రోల్, డీజిల్ సరఫరాపై పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన

28-04-2026 11:42 AM
  1. పెట్రోల్, డీజిల్  కొరత లేదు.
  2. రాష్ట్రంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి.
  3. నిన్న డిమాండ్ కు మించి పెట్రోల్, డీజిల్ సరఫరా.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, పెట్రోల్, డీజిల్ కొరత లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర(Stephen Ravindra) ప్రకటించారు. సోమవారం నాడు డిమాండ్ ను మించి పెట్రోల్, డీజిల్ సరఫరా చేశామని తెలిపారు. నిన్న ఒక్కరోజే 29,939 లీటర్ల పెట్రోల్, డీజిల్ సరఫరా చేయబడిందని వెల్లడించారు. సగటున రోజుకు 5,883 లీటర్ల పెట్రోల్, 7,348 లీటర్ల డీజిల్ కు డిమాండ్ ఉందని ఆయన తెలిపారు.

అయితే సోమవారంనాడు, వాహనదారులకు 11,490 లీటర్ల పెట్రోల్, 18,449 లీటర్ల డీజిల్ సరఫరా చేశామని స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. సరఫరాలపై పెట్రోల్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు. అపోహలతో పెట్రోల్, డీజిల్ ఎక్కువ కొని నిల్వ చేసుకోవద్దని పౌర సరఫరాల కమిషనర్ సూచించారు. పెట్రోల్, డీజిల్ స్టాక్ లేదని పుకార్లు రావడంతో మూడ్రోజులుగా వాహనదారులు బంకుల వద్ద భారీగా క్యూ కట్టారు. నగరంలో పాటు జిల్లాల్లోని పలు బంకులు మూతపడగా,  కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు.