విధులను నిర్లక్ష్యం చేస్తున్న వారిపై చర్య తీసుకోండి
26-03-2026 04:45 PM
ఖానాపూర్,(విజయక్రాంతి):మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉద్యోగులు విధులను నిర్వహించకుండా వేతనాలు తీసుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. నలుగురు ఉద్యోగు లు విధులకు హాజరు కాకుండా అక్కడ సిబ్బందిని తక్కువ వేతనాలకు ఏర్పాటు చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని వారు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎంపీడీవో సహకారంతోనే వీరు విధులను విస్మరిస్తున్నారని విచారణ జరిపి చర్య తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నరేష్ తదితరులున్నారు




