26 March, 2026 | 6:40 PM

ఈ నెల 31న జిల్లా స్థాయి క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు

26-03-2026 04:48 PM

జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎ. సురేష్

పెద్దపల్లి,(విజయ క్రాంతి):తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ  హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ అనుమతితో ఈ నెల 31వ తేదీన జిల్లా స్థాయి క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు నిర్వహించ నున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎ. సురేష్  గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ​మండల స్థాయిలో ప్రతిభ కనబరిచి ఎంపికైన క్రీడాకారులకు జిల్లా స్థాయి పోటీలకు అర్హులని, మార్చి 31న మంగళవారం ఉదయం 10:00 గంటలకు పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాల మైదానం లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని, మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు నిర్ణీత సమయానికి మైదానానికి చేరుకోవాలన్నారు.

ఎంపిక పోటీలకు వచ్చే క్రీడాకారులు,​ ఆధార్ కార్డు,​ ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుండి పొందిన బోనఫైడ్ సర్టిఫికేట్, ​పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, ​3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, ​ ఐదు పాస్‌ పోర్ట్ సైజ్ ఫోటోలు,​ తాజా కుల ధృవీకరణ పత్రం, ఒక సెట్ ఒరిజినల్ , జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలని, 4వ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులు 01.09.2017 నుండి 31.08.2018 మధ్య జన్మించి ఉండాలి, 31.08.2026 నాటికి వయస్సు పరిగణనలోకి తీసుకోబడుతుందని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి  ఆ ప్రకటనలో  పేర్కొన్నారు.