26 March, 2026 | 6:24 PM

ఉపాధి హామీ కూలీలకు కష్టాలు తీరదే?

26-03-2026 04:44 PM

మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ఎదురవుతున్న సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడం పట్ల మాజీ రాష్ట్ర జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.గురువారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల మాజీ ఉమన్నగారి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనుల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధి హామీ పనులపై బాధ్యత తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని,దీనివల్ల ఉపాధి హామీ కూలీలు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు.అలాగే ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారిందని తెలిపారు.రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధి హామీ కూలీలు,ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.