సమ్మర్ క్యాంప్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్య పేట జిల్లా మఠంపల్లి మండలంలోని మోడల్ స్కూల్ లో నిర్వహించే సమ్మర్ క్యాంప్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మఠంపల్లి తాహశీల్దార్ లావురి మంగా, సర్పంచ్ ఏసుమల్ల వీరలక్ష్మి పాపయ్య అన్నారు.సోమవారం మోడల్ స్కూల్ సమ్మర్ క్యాంప్ శిబిరాన్ని అధికారులతో కలిసి ప్రారంభించి మాట్లాడుతూ 15 రోజులు నిర్వహించి ఈ క్యాంప్ లో 6వ తరగతి నుండి 9వ తరగతి పిల్లలు ఏ స్కూల్ చదువుతున్న వారికి హార్మోనియం, చెస్, యోగా, ఎలక్ట్రిక్, ఇండోర్ గేమ్స్,క్యారమ్స్ ఇతర ఆటలకు శిక్షణ ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలను ఈ క్యాంప్ శిబిరాన్ని కి పంపించాలని కోరారు.మే 11నుండి 26వ తారీఖు వరకు ఉదయం 08 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివ,ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






