క్షతగాత్రురాలుకి అండగా చేయూత ట్రస్ట్
11-05-2026 08:49 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక గ్రామంలో ఒక అద్దె ఇంట్లో నివాసముంటున్న నర్మద అనే మహిళ ఇటీవల ప్రమాదానికి గురై రెండు కాళ్లు విరిగి, వెన్నుముక చేతిలో తీవ్రమైన గాయాలయ్యాయి. క్షతగాత్రురాలు ఆపరేషన్ నిమిత్తం మంచానికే పరిమితమవడంతో సోమవారం మోరంపల్లి బంజర్ గ్రామానికి చెందిన చేయూత ట్రస్ట్ వారు ఆమె ఉంటున్న నివాసం ఇంటికి వెళ్లి పరామర్శించి రూ.6000 ఆర్థిక సహాయాన్ని అందించారు.






