calender_icon.png 9 February, 2026 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే సుల్తానాబాద్ మున్సిపల్ అభివృద్ధి

09-02-2026 07:27:52 PM

సుల్తానాబాద్ బిఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి రమణారావు

సుల్తానాబాద్, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని బిఆర్ఎస్ పార్టీ సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి కోరుగంటి రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సుల్తానాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ని మున్సిపల్ గా చేశామని అన్నారు.. అప్పుడు జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుందని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలోనీ 15 వార్డులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని అన్నారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొన్ని పనులు మిగిలిపోయాయని వాటిని ఇప్పుడు ప్రభుత్వం పూర్తి చేస్తూ మేమే సుల్తానాబాద్ పట్టణం అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎదవ చేశారు. ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ బిఆర్ఎస్ పార్టీ నుండి అత్యధిక స్థానాలు గెలుచుకోవడం జరుగుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రమణారావు వెంట  బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల రామారావు, కోడెం అజయ్, పారుపల్లి గుణపతి, సందీప్ రావు, తాళ్లపల్లి మనోజ్ గౌడ్, అనుమాల బాపూరావు, గందేమల్లికార్జున్, కొయ్యడ అరుణ్, పురం రమణ   తదితరులు పాల్గొన్నారు.