ఇంత విద్వేషమా?
- ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన
- తెలంగాణ అమరవీరుల త్యాగాలను అవమానించడమే!
తేజస్వి సభ్యత్వం రద్దు చేయాలి: మంత్రి పొన్నం
తెలంగాణ వ్యతిరేకత బీజేపీ నరనరనా నిండి ఉన్నది: బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకపోవడం సిగ్గుచేటు: మాజీమంత్రి హరీశ్
భారత్- పాకిస్థాన్‌ను విడగొట్టినట్టు కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రాను ఏపీ, తెలంగాణగా విభజించిందని లోక్‌సభ వేదికగా గురువారం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆయన తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచారని, ఆ వ్యాఖ్యలను రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు ఎందుకు తిప్పికొట్టలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. సూర్య ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ స్పీకర్‌ను డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
స్పందిస్తూ.. పార్లమెంట్ వేదికగా మరోసారి తెలంగాణకు అవమానం జరిగిందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రా విభజనను భారత్ -పాక్‌తో పోల్చడం కుసంస్కారమని మండిపడ్డారు. ఎవరి దయాదాక్షిణ్యాలతో తెలంగాణ ఏర్పడలేదని, దశాబ్దాల పోరాటం, వేలాది మంది యువకుల బలిదానాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా తేజస్వి సూర్య వ్యాఖ్యనించారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం : బీఆర్‌ఎస్ నేత కేటీఆర్






