పోరాడుతున్న ఆస్ట్రేలియా
- రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబాటు
- బంగ్లాదేశ్‌కు భారీ ఆధిక్యం
డార్విన్, ఆగస్టు 15 : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పోరా డుతోంది. మూడో రోజు సైతం బంగ్లాదేశ్ ఆధిపత్యం కనబరిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య కంగారూ జట్టును 198 పరుగులకే పరిమితం చేసిన బంగ్లాదేశ్... తమ మొదటి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా 228 పరుగుల మేర భారీ ఆధిక్యం సంపాదించింది. తంజిద్ హస న్ 101 పరుగులు, నజ్ముల్ హుస్సేన్ శాంటో 84, మెహిదీ హసన్ మిరాజ్ 65 పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ 6 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్ హసన్ మహమూద్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీ స్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. మహమూద్ బౌలింగ్‌లో ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (17), జేక్ వెదర్లాండ్ (0) బౌల్ అయ్యారు. మిగ తా వారిలో వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 31 పరుగులతో రాణించాడు. అయితే, తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఇక స్టీవ్ స్మిత్ 44 పరు గులు చేసి మెహిదీ హసన్ మిరాజ్ బౌలిం గ్‌లో నిష్క్రమించాడు. గ్రీన్ 86 బంతుల్లో 43 పరుగులు, క్యారీ 50 బంతుల్లో 19 పరుగులతో ఉన్నారు. ఫలితంగా 53 ఓవర్లలో ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేయగలిగింది.






