16 August, 2026 | 4:20 AM

ఆరంభం అదిరింది

16-08-2026 12:45 AM
  1. హాకీ ప్రపంచ కప్‌లో భారత్ బోణీ 
  2. వేల్స్‌పై ఘన విజయం 

ఆమ్ స్టీరెవెన్, ఆగస్టు 15: బెల్జియం మరియు నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2026 ఎఫ్ ఐ హెచ్ పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో భారత పురుషుల జట్టు ఘనమైన బోణీ కొట్టింది. ఆగస్టు 15న జరిగిన తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 3-1 గోల్స్ తేడాతో వేల్స్‌పై అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు కీలక గోల్స్ చేసి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ ఆధిపత్యం చెలాయించింది. తొలి క్వార్టర్‌లో రెండు గోల్స్ నమోదు చేసింది. ప్రత్యర్థి ఆటగాడి తప్పిదంతో ఏడో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సుమిత్ గోల్‌గా మలిచి 1-0తో శుభారంభం అందించాడు.

మరో మూడు నిమిషాల వ్యవధిలోనే భారత్కు రెండో పెనాల్టీ కార్నర్ లభించగా.. హర్మన్ ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచి భారత్ ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేశాడు. రెండో క్వారర్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో గోల్స్ నమోదు కాలేదు. కానీ భారత్ బం తిని తమ ఆదీనంలో ఉంచుకొని ఆధిపత్యం చెలాయిస్తూ ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడులు చేసే ప్రయత్నం చేసింది. కానీ వేల్స్ డిఫెన్స్ సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. ఈ క్రమం లో భారత్ ఒక పెనాల్టీ కార్నర్ వృథా చేసింది.

మూడో క్వార్టర్ చివర్లో భారత్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించగా.. హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచి భారత్ ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. ఆఖరి క్వార్టర్‌ల్లో వేల్స్ ఆధిప త్యం చెలాయించింది. బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకొని భారత్‌పై ఎదురదాడికి దిగింది.

ఆ జట్టుకు 55వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ లభించింది. వేల్స్ సామ్ గోల్‌గా మలిచి ఆ జట్టు ఖాతా తెరిచాడు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్(10వ, 42వ నిమిషం) డబుల్ గోల్స్‌తో సత్తా చాటగా.. సుమిత్(7వ నిమిషం) ఏకైక గోల్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. భార త్ తమ తర్వాతి మ్యాచ్‌ను ఆగస్ట్ 17న ఇంగ్లండ్‌తో ఆడనుంది.