14 April, 2026 | 4:04 PM

వృథాగా నిర్మాణాలు.. నిధులు నేలపాలు..

14-04-2026 01:19 AM

పోలీసు ఉన్నతాధికారికి నివాసమేది..?

బెల్లంపల్లి, ఏప్రిల్ ౧౩ (విజయక్రాంతి):  అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అనాలోచితం వెరసి లక్షల ప్రజాధనం నిస్ప్రయోజనం అయ్యింది. ఈ దుర్వినియోగం జరిగింది సాక్షా త్తు పోలీసు శాఖ విషయంలోనే... బెల్లంపల్లి ఏసీపీ ఆఫీసు, నివాసం విషయంలో నిధుల దుర్వినియోగం భారీగా నెలకొంది అంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతటి బాధ్యతగా ఉన్నారో తెలుస్తోంది. వారి బాధ్యతరాహిత్యం ఇక్కడ మరోసారి స్పష్టం అవుతున్నది. ఇలా చేసిన వారు ప్రస్తుతం అధికారులలో ఉన్నా రా..? లేరా ఆనేది ముఖ్యం కాదు.

గత పాలకు లు ఇప్పుడు లేకపోవచ్చు, కానీ యంత్రాంగం మాత్రం యధాతథమే కదా. ఈ విషయంలో నిధుల దుర్వినియోగం ఎవరి తప్పు, అందుకు చర్యలేవి? ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరించ డం వారి జన్మహక్కా అన్న తీవ్ర విమర్శలున్నాయి. అభివృద్ధి నిరోధక పనితీరు కట్టడి లేదా అన్న ప్రశ్నలు కూడా రేకెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో  బెల్లంపల్లిలో పని చేస్తోన్న పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వపరంగా గృహ వసతి ఇప్పటికీ లేదు. ప్రత్యామ్నాయo గా సింగరేణి అద్దె భవనాలే పోలీసులకు దిక్కయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో 2015లో రూ. 45 లక్షలతో ఒక ప్రయత్నం జరిగింది.

అది నిర్మాణ రూపం ధరించింది. ఆర్ అండ్ బి అధికారులు భవ నం, రూ.18 లక్షలతో ప్రహారిగోడ, రోడ్లు నిర్మించారు. నిర్మా ణ పూర్తయ్యి ఏళ్ళు గడిచినా అది కాస్త  నిరుపయోగంగా ఉండిపోయింది. ఆ భవనం ఎందు కు పనికిరాకుండా పోయింది. తలుపులు, కిటికీలు ఇతర వస్తువులు దొంగల పాలయ్యాయి. పాడుపడిన బంగ్లాగా మారిపోయింది. పోలీసుశాఖ ఈ భవనాన్ని ఇప్పటికీ తీసుకోలేదు. అందుకు కారణాలు గుప్తంగానే ఉండి పోయాయి.

ఈ విషయంలో ఒక వాదన అయితే ప్రచారంలో వినిపిస్తోంది. గతంలో ఆ సమయంలో బెల్లంపల్లి ఏసీపీగా పనిచేసిన ఓ అధికారి, సదరు భవనం నివాసయోగ్యానికి అనుకూలంగా లేదని నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా సెక్యూర్టీ కోణంలోనే విముఖత చూపినట్టు ఆయనపై నెట్టివేతగా వినిపిస్తున్న ప్రచారం. ఇందులో నిజంపై బిన్నాభిప్రాయా లు లేకపోలేదు. ఒకటి మాత్రం వాస్తవం.. నిజంగా రక్షణ పరమైన సమస్యే అనుకుంటే.. ఆ స్థలాన్ని తొలుత  పోలీసు అధికారులు ఒప్పుకునేవారే కాదు కదా..

వారి సమ్మతి, కనుసన్నల్లోనే ఈ భవన నిర్మాణ పనులు చేపట్టా రు. కనుక ఇక్కడ రక్షణ విషయానికి ఆస్కారం లేదు. అది బొత్తిగా అబద్ధమే. ఈ భవనం ఎక్కడో కాదు.. పట్టణ నడిబొడ్డున రాంనగర్ లోనీ 170 పీపీలోని 3 ఎకరా ల్లో నిర్మించారు. దాని చుట్టూ జనావాసాలే ఉన్నాయి. పోలీసు సబ్ డివిజన్ అధికారి నివాసం కోసం ప్రత్యేకంగా అన్ని హంగులతో ఈ భవనం నిర్మిం చారు.. బెల్లంపల్లిలో చిరకాలంగా ఇక్కడ పోలీస్ అధికారులకు పక్కా భవ నాలు లేవు. పోలీసుల అధికారుల  నివాస అవసరాలను సింగరేణి యాజమాన్యమే సర్దుబాటు చేస్తుంది. అదే పద్దతి ఇప్పటికీ, ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ విషయంలో ఆది నుంచి పాలకుల నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. 

శాంతిభద్రతలు, ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులకు తమ ప్రాణా లు పణంగా పెట్టి కాపాడుతున్న పోలీసు అధికారులకు ఇప్పటికీ బెల్లంపల్లిలో గృహవసతి కల్పనా లేకపోవడం విడ్డూరంగా చెప్పుకోవచ్చు. పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో పోలీసుల పట్ల ఈ సుదీర్ఘ కాలం నిర్లిప్తతే తిరుగులేని సాక్షి భూతం.

పోలీసు భవనంపై రాజకీయాలు..?

పోలీసు అధికారుల నివాసంపై రాజకీయా లు ఆవరించాయి. భవనం నిర్మించిన సదరు కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లించక పోవడం రాజకీయమే అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ భవ నం నిర్మాణం పూర్తి తరువాత అనూహ్యం గా రాజకీయ జోక్యం అవరొదమయ్యింది. కాం ట్రాక్టర్ కు బిల్లులు ఎగవేశారన్న ఆరోపణలు అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి. ఒక దశలో సదరు కాంట్రాక్టర్ బిల్లుల కోసం ఆందోళన చేశారు.

ఎవరూ సపోర్టు చేయకపోవడంతో ఆ తర్వాత ఆ సమస్య మరుగున పడిపోయింది. ఆధునిక హంగులతో నిర్మించిన భవనం పోలీసుల చెంతకు వెళ్లకపోవడం వెనుక రాజకీయమే అడ్డువచ్చిందన్న ఆరోపణలున్నాయి. అప్పటి నియోజక వర్గ ప్రజా ప్రతినిధితో ఉన్న విభేదాల ఫలితంగానే ఇవన్నీ జరిగాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమైనా పోలీస్ అధికారి నివాస భవనం వెనుక ఇన్ని కారణాలు అల్లుకున్నాయి. కాంట్రాక్టర్ లక్ష్యంగా గత పాలకులు కక్ష సాధింపులో పోలీ సు అధికారీ భవనం ప్రధాన పావుగా మారిపోయిందనీ విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు.

పోలీసుల నుంచి తిరస్కారం కాకతాళీయంగా జరిగింది కాదు. రాజకీయ జోక్యం వల్లనే పోలీసు శాఖకు భవనాన్ని జారవిడుచుకుంది. రాజకీయ కక్షలు, పోలీసు అధికారుల నివాస సమస్యను మళ్ళీ మొదటికే తెచ్చింది. పోలీసు అధికారుల గృహవసతి సమస్య  అపరిస్కృతంగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో రాజకీయ ఆధిపత్య సాధింపు ఫలితం ప్రజాధనంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. లక్షలాది నిధులతో నిర్మించిన పోలీ సు భవనం సద్వినియోగం దిశగా అడుగులు పడాలని పలువురు కోరుతున్నారు.