31 May, 2026 | 1:35 AM

గంటన్నరే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

31-05-2026 12:11 AM
  1. ఉదయం 8.30 నుంచి 10 గంటలకే పూర్తిచేయాలి 
  2. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం 

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): రాష్ట్రం లో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఉదయం పూటనే నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశిం చారు. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఉదయం 8.30 గంటలకే ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

గంటన్నర వ్యవధిలోనే (ఉదయం 10 గంటల వరకు) అన్ని రకాల అధికారిక అవతర ణ కార్యక్రమాలను పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఎండలు ముదురక ముందే వేడుకలను ముగించడం ద్వారా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ వేడుకలకు హాజరయ్యే అతిథులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.