31 July, 2026 | 9:47 PM

నగర డిప్యూటీ మేయర్ కు వినతి పత్రం సమర్పణ

31-07-2026 08:36 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ 11వ డివిజన్ పరిధిలోని కట్టరాంపూర్, అయోధ్య కాలనీ తదితర ప్రాంతాల్లో మధ్యలోనే నిలిచిపోయిన సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ స్థానిక ప్రజలు, బీజేపీ నేతలు పండుగ స్వప్న నాగరాజు  ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, యాదగిరి సునీల్ రావుకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ...అయోధ్య కాలనీ, కట్టరాంపూర్ నుండి వేములవాడ బైపాస్ ప్రధాన రహదారికి వెళ్లే కనెక్టింగ్ రోడ్డు సుమారు 50 సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉండి అత్యంత దయనీయ స్థితిలో ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు  సానుకూలంగా స్పందించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ తీవ్రమైన సమస్యను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.