ప్రజల గుండెల్లో చిరస్థాయిగా శ్రీపాద
- నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్
శ్రీపాదరావు 89వ జయంతి
హైదరాబాద్ శిల్పకళ వేదికలో నిర్వహించనున్న
వేడుకలకు హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
మంథని, మార్చి1(విజయక్రాంతి): తెలు గు రాజకీయాల్లో దుద్దిళ్ల శ్రీపాదరావుది ప్ర త్యేకమైన చరిత్ర. ఆయన వ్యక్తిత్వమే ప్రజలకు దగ్గర చేసింది. ఇప్పటికీ జనాల గుండె ల్లో నిలిచేలా చేసింది. శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా మనందరం స్మరించుకుందాం.తెలంగాణ మార్చి 2, 1935న కాటారం మండలం ధన్వాడ గ్రామంలో జన్మించిన శ్రీపాదరావు సర్పంచ్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి వరకు ఎదిగారు.
న్యాయవాదిగానూ సేవలు అం దించారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శ్రీపాదరావు బాల్యమం తా పల్లెటూరులోనే గడిచింది. తల్లిదండ్రులు రాధాకృష్ణయ్య, కమలాబాయి ఇచ్చిన విలువలు ఆయన ప్రస్థానానికి పునాదిరాళ్లయ్యా యి. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే ఆయన ధన్వాడలో ప్రాథమిక విద్య, మంథనిలో ఎస్‌ఎస్సీ పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్ చేరారు.
ఆ తర్వాత ఆదిలాబాద్‌లో పంచాయతీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. దీంతో ఆయనకు గ్రామ పరిపాలనపై స్పష్టమైన అవగాహన ఇచ్చిం ది. అనంతరం నాగపూర్‌లో న్యాయశా స్త్రం చదివి న్యాయవాదిగా సేవలందించా రు. వ్యవసాయం చే స్తూ రాజకీయాల్లోకి తండ్రి మరణం తర్వాత శ్రీపాదరావు తన స్వగ్రామానికి తిరిగి వచ్చి వ్యవసాయం చేశారు. ఆ వ్యవసాయమే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. వరుసగా రెండు సార్లు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై, మహదేవపూర్ సమితి అధ్యక్షుడిగా, మం థని ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ చైర్మన్‌గా పనిచేశారు.
1983లో తెలుగుదేశం పార్టీ ప్రభం జనం మధ్య కాంగ్రెస్ అభ్యర్థిగా మంథని నుంచి పోటీ చేసి విజయం సాధించడం సాధారణ విషయం కాదు. ప్రజల విశ్వాసం ఆయనకు రాజకీయ బలంగా మారింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మంథని నియోజకవర్గ అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేశారు. 1990 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయనకు లభించిన అత్యున్నత గౌరవం అని చెప్పవచ్చు.
శ్రీపాదరావు స్పీకర్‌గా ఉన్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుల క్రమశిక్షణ పెరిగింది. ప్రజలకు ఉపయోగపడే చర్చలన్నీ గౌరవప్రదంగా జరిగేలా చూశారు. సభాపతి పీఠం పట్ల ప్రజల్లో ఉన్న గౌరవాన్ని నిలబెట్టారు. 1994 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ... ప్రజాసేవలో మాత్రం శ్రీపాదరావు వెనకడుగు వేయలేదు.
నక్సలిజం ప్రభావం ఉన్న ప్రాం తంలోనూ ప్రజల మధ్యే ఉన్నారు.1999 ఏప్రిల్ 13న మహదేవపూర్ మండలం అ న్నారం సమీపంలో మావోయిస్టుల చేతిలో హత్యకు గురవడం యావత్ తెలుగు ప్రజలను కలచివేసింది. ప్రజల కోసం జీవించిన నాయకుడి జీవితం ఇలా బలవడం తెలంగాణ రాజకీయ చరిత్రలో విషాద ఘట్టంగా నిలిచిపోయింది.
శ్రీపాదరావు జయంతి వేడుకలు
దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు మార్చి 2న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని గత సంవత్సరం ఫిబ్రవరి 25న నిర్ణయించింది. ఇది ఆయన మీద ఉన్న గౌరవానికి నిదర్శనం. పార్టీలకు అతీతంగా అందరి గౌరవాన్ని పొందిన నాయ కుడిగా ఆయన నిలిచారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న 89వ జయంతి కార్యక్రమంలో శ్రీపాదరావు స్మా రక అవార్డులు వివిధ రంగాల్లో విశిష్ట సేవ లు అందించిన ప్రముఖులకు అందజేస్తున్నారు.
భారత రక్షణ రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన డాక్టర్ జి. సతీష్ రెడ్డి , అన్నమ య్య కీర్తనలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన పద్మశ్రీ డాక్టర్ శోభారాజు , సాంకేతిక రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు చెందిన ఆర్. వెంకటరామన్, సాంకేతిక, వృత్తిపర విద్యలో నూతన ఆవిష్కరణలకు మార్గదర్శకులైన డాక్టర్ సు బ్బరంగయ్య కొప్పరపు ఈ పురస్కారాలు అందుకోనున్నారు.
అవే విలువలతో రాజకీయాల్లో శ్రీధర్ బాబు
తండ్రి స్ఫూర్తిని ఆయన కుమారుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముందుకు తీసుకెళ్తున్నారు. 1999 నుంచి వరుసగా ఐదుసార్లు మంథని ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విప్‌గా, మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారు. రాష్ట్ర విభజన చట్ట ప్రక్రియలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర అవిర్భావనికి కృషి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖలను నిర్వహిస్తూ అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నారు.




