8 April, 2026 | 5:03 PM

కమిషనర్ గా శ్రీహరి రాజు

08-04-2026 03:00 PM

బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ కమిషనర్(Banswada Commissioner) శ్రీహరి రాజు బుధవారం నాడు బిచ్కుంద కమిషనర్ గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. గతంలో ఇక్కడ కమిషనర్ గా ఉన్న హయ్యుం మెడికల్ లీవ్ లో తీసుకున్నారని సంబంధిత అధికారి పేర్కొన్నారు. నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన భట్టు శ్రీహరి రాజు మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతానని తెలియజేశారు. కార్యక్రమంలో భాగ్యలక్ష్మి ప్రేమ్ సేట్, సందాని, దర్పల్ కార్తికా సంతోష్, ముజాహిద్, ఇతర కౌన్సిలర్లు కార్యాలయం సిబ్బంది శ్రీనివాస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.