8 April, 2026 | 5:11 PM

గిరిజన గురుకుల పాఠశాలకు గ్రీన్కో ఫౌండేషన్ కంప్యూటర్ల అందజేత

08-04-2026 03:01 PM

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో కంప్యూటర్ల పంపిణీ.

కామారెడ్డి,(విజయక్రాంతి): వరద ముంపుకు గురైన గిరిజన గురుకుల పాఠశాల కు గ్రీన్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం కంప్యూటర్లను పంపిణీ చేశారు. నాగిరెడ్డిపేట చెందిన  గిరిజన గురుకుల పాఠశాల కామారెడ్డి సమీపంలోని సరంపల్లి వద్ద నిర్వహిస్తున్నారు. ఇటీవల కామారెడ్డి లో వరదలు వచ్చినప్పుడు గిరిజన గురుకుల పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ వరద నీటికి కొట్టుకపోయింది.

కంప్యూటర్లు పాడైపోయాయి. ఈ విషయాన్ని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అమర్ సింగ్  కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించి గ్రీన్కో ఫౌండేషన్ కు తెలపడంతో వారు సానుకూలంగా స్పందించి  కంప్యూటర్లను కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ సమక్షంలో ప్రిన్సిపల్ అమర్ సింగ్ కు అందజేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రీన్కో ఫౌండేషన్ ప్రతినిధులకు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.