28 March, 2026 | 2:29 AM

వైభవంగా సీతారాముల కల్యాణం

28-03-2026 12:25 AM

వనపర్తి, మార్చి 27 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని రామాలయం తో పాటు పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించి, పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సీతారాముల వివాహం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా భక్తులు పెద్దఎత్తున దర్శనం చేసుకున్నారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మహిళలు మంగళహారతులు పట్టి భక్తి భావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం కు ఎమ్మెల్యే మేఘారెడ్డి దంపతులు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డీ లు స్థానిక నాయకులతో కలిసి వేరువేరుగా హాజరై దైవ అనుగ్రహం ను కోరుకున్నారు.