ఘనంగా శ్రీ నీలకంఠ రామస్వామి బ్రహ్మోత్సవాలు
మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండలం చర్లగూడెం (శివన్న గూడెం) శ్రీ నీలకంఠ రామ స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వాహకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ సిరి ప్రగడ ఆనందరావు ఆధ్వర్యంలో స్వామి వారి రథోత్సవాన్ని పురోహితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా శివన్నగూడ గ్రామ సర్పంచ్ రాపోలు యాదగిరి సమక్షంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ జిల్లా ఎగ్జిక్యూటివ్ అధికారి జయరామయ్య ముఖ్యఅతిథిగా హాజరై బ్రహ్మోత్సవాలను తిలకించి నిర్వాహకుల సమక్షంలో స్వామివారి ప్రసాదములు స్వీకరించారు. అదేవిధంగా దేవాలయ అభివృద్ధిని ప్రాజెక్టు నిర్మాణంలోగా మునుగోడు ఎమ్మెల్యే సమక్షంలో మరింత అభివృద్ధి చేసేందుకు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సిరి ప్రగడ వినోద రావు రవీందర్రావు రాజేందర్ రావు మహేందర్ రావు రాహుల్ శ్రీధర్ రావు సుధీర్ రావు గోపాల్ మరి గూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ మాల్ మార్కెట్ ఉపాధ్యక్షులు నక్క శ్రీనివాస్ మాజీ జెడ్పిటిసి యాదయ్య చంద్రయ్య ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు




