7 March, 2026 | 3:44 AM

శ్రీభూ నీళా సమేత శ్రీవెంకటేశ్వరస్వామి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

06-03-2026 08:55 PM

మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి, డిసిసి అధ్యక్షులు వజ్రష్ యాదవ్ ప్రత్యేక పూజలు

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని ఫిర్జాదిగూడ  పి అండ్ టి కాలనీలో శ్రీభూ నీళా సమేత శ్రీవెంకటేశ్వర స్వామి వారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ లు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదాలు స్వీకరించి, ఆలయ అభివృద్ధి కోసం నిర్వాహకులు చేస్తున్న సేవలను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫీర్జాదిగూడ మాజీ మేయర్లు జక్క వెంకట్ రెడ్డి, అమర్ సింగ్, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, మాజీ కార్పొరేటర్లు  శ్రీధర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.