calender_icon.png 10 February, 2026 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మికమే ఆదర్శం!

10-02-2026 02:18:32 AM

  1. అభివృద్ధే తారకమంత్రం

ఈ రెండే కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ ఎన్నికల తంత్రం

కరీంనగర్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల ప్రచార సరళి, ఎన్నికల ఎజెండా, అభ్యర్థుల గెలుపు కోసం వేసే ఎత్తుగడలు వంటి అంశాలను పరిశీలిస్తే అన్నింట్లోనూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సం జయ్ కుమార్ అగ్రభాగాన నిలిచారు. బండి సంజయ్ ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తూ వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. మొదటిది అభివృద్ధి నినా దం, రెండోది ఆధ్యాత్మికం కాగా మూడో అంశం ఆదర్శవంతమైన పాలన.

కరీంనగర్ కార్పొరేషన్ సహా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలన్నింటిలోనూ భారతీయ జనతా పార్టీ ప్రచారంలో నూ ముందంజలో ఉంది. బండి సంజయ్ అన్నీ తానై ప్రచారంతోపాటు అభ్యర్థుల గెలుపు బాధ్యతలను పూర్తిగా తన భుజాన వేసుకుని పనిచేశారు. ఒకవైపు ప్రచారం.. మరోవైపు పార్టీ కార్యక్రమాలు.. ఇంకోవైపు పోల్ మేనేజ్ మెంట్ సహా అన్నీ పనులు ఒంటి చేత్తో నిర్వర్తిస్తూ ఎన్నికల్లో అభ్యర్థులకు పెద్దగా కష్టం లేకుండా చేయడంలోనూ అగ్రభాగాన నిలిచారు. ఎన్నికల ప్ర చారంలో బండి సంజయ్ ఈసారి విభిన్న రీతిలో ప్రచారం నిర్వహించారు.

హిందుత్వ నినాదాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తారని ప్రత్యర్థ పార్టీలు భావించారు. అందుకు భిన్నంగా పూర్తిగా అభివృద్ధి నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లారు. కరీంనగర్ కార్పొరేషన్ సహా జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు, కేంద్రాన్ని ఒప్పిం చి మెప్పించి తాను తెచ్చిన నిధులతో జరిగిన అభివృద్ధి పనులను ప్రతి మీటింగ్‌లో నూ వివరించారు.

మాటలకే పరిమితం కా దు చేతల్లో చూపుతున్న అభివృద్ధి కాముకుడు అనే భావనను ప్రజలకు కలిగించడం లో సక్సెస్ అయ్యారు. బండి సంజయ్‌లో స్వతహాగా దైవ భక్తి, అధ్యాత్మిక చింతన ఎక్కువ. ప్రజల్లో అధ్యాత్మిక చింతన పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రచారంలో ఎక్కడ ఆలయాలు అభివృద్ధికి నోచుకోలేదో వాటిని అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. ప్రజలు ఎక్కడ ఆలయం కావాలని కోరితే అక్కడ నూతన ఆలయాలను నిర్మిస్తానని హామీ ఇచ్చారు.

మూడో విషయానికొస్తే కరీంనగర్ కార్పొరేషన్ మే యర్ తోపాటు ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే అవినీతి, కబ్జాదారుల అంతు చూస్తానని, కరీంనగర్ ప్రజలకు రక్షణ కవచంగా నిలుస్తానని చెబుతూ వచ్చారు. అవి నీతికి, భూకబ్జాలకు తావు లేకుండా కరీంనగర్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శ వంతమైన పాలన అందించే బాధ్యత తీసుకుంటానంటూ భరోసా ఇచ్చే ప్రయ త్నం చేశారు.

మొత్తంగా బండి సంజ య్ ఎంచుకున్న ఈ మూడు అంశాలు ప్రజల్లోకి విస్త్ర తంగా వెళ్లాయి. సంజయ్ ఎక్కడ స్ట్రీట్ కార్న ర్ మీటింగ్ నిర్వహించినా తండోపతండాలుగా తరలివచ్చారు. సంజయ్ ప్రచార సర ళి, ఎన్నికల ఎత్తుగడ దెబ్బకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయాయి. అటు ప్రచార సరళిలో, ఇటు ఎన్నికల ఎత్తుగడలో పూర్తిగా వెనుకబడిపోయారు. ప్రధా న పార్టీల ముఖ్య నేతలు సైతం ఏం చేయా లో తెలియక నిశ్చేష్టులైపోవడం గమనార్హం.