ఆధ్యాత్మిక గురువు అవతార్ మెహర్ బాబా
25-02-2026 09:45 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అవతార్ మెహర్ బాబా ఒక భారతీయ ఆధ్యాత్మిక గురువని నిర్వాహకులు తాటిపల్లి రాజేశ్వర్, అశోక్ తెలిపారు. బుధవారం అవతార్ మెహర్ బాబా 132వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని తమ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెహర్ బాబా బోధనలు ప్రేమ, సత్యం, సేవ, ఆధ్యాత్మికతపై ఆధారపడి ఉన్నాయని, సేవ ద్వారానే దేవత్వాన్ని సాధించవచ్చని ఆయన బోధించారని పేర్కొన్నారు.అవతార్ మెహర్ బాబా 1969 జనవరి 31న మహారాష్ట్రలోని మెహర్‌బాద్లో మహాసమాధి పొందారని గుర్తుచేశారు. అనంతరం భక్తులు, ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సతీష్, గిరీష్, ఆశిష్, హరీష్, అశోక్, సంతోష్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.




