20 April, 2026 | 2:01 AM

వేసవి రద్దీకి ప్రత్యేక రైళ్లు

20-04-2026 12:00 AM

సికింద్రాబాద్, ఏప్రిల్19 (విజయక్రాంతి): ప్రయాణికుల వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించి ంది. ఏప్రిల్ నెలలో వివిధ గమ్యస్థానాల మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు అధి కారిక ప్రకటనలో వెల్లడించింది.

తిరుపతి ఖరగ్పూర్, ఖరగ్పూర్ మచిలీపట్నం  చర్లపల్లి హెచ్.ఎస్. నాందేడ్ చెన్నై సంత్రా గాచి వంటి ముఖ్య మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు సేవలు అందించనున్నాయి. ప్రతి రూట్లో ఒక్కో సర్వీస్ చొప్పున ప్రత్యేకంగా నడపబడు తుందని, రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో ఈ ప్రత్యేక రైళ్లు ఉపశమనం కలిగిస్తాయని ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్లు చేసు కోవాలని రైల్వే అధికారులు సూచించారు.