5 March, 2026 | 3:03 PM

తొగర్రాయి వేణుగోపాలస్వామి ఆలయంలో విశేష పూజలు

05-03-2026 12:14 AM

కోదాడ,  మార్చి 4 : మండలంలోని తొగర్రాయి గ్రామంలోని ప్రాచీన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం సేవాకాలం, స్వామి వార్ల ఉత్సవ మూర్తులు, మూల మూర్తులకు పంచామృతాలు, పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. 

ఆ తరువాత దేవాలయ ధర్మకర్తలు యాదా వారి వంశీయులు స్వామి వార్లకు నూతన పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ పిగిడిమర్రి సరస్వతి మదనమోహనరావు, గ్రామ సర్పంచ్ లక్కి గురవమ్మ వెంకటయ్య,  దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి తుమ్మల వెంకట చలపతి, దేవాలయ అర్చకులు ముడుంబ విష్ణువర్ధనఆచార్య, ముడుంబ  లక్ష్మనాచార్యులు, రెంటాల పుల్లేశ్వరశర్మ, మహంకాళి రాకేష్ శర్మ,  నందుల లక్ష్మీనరసింహశాస్త్రి, యాదా సత్యనారాయణ, కమిటీ సభ్యులు యాదా శ్రీనివాసరావు వంగాల మమత, జడ కృష్ణయ్య, యలమర్తి వెంకటనారాయణ, గ్రామ పెద్దలు ఉప సర్పంచ్ అమెరబోయిన ఉమ, మాజీ సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ, శ్రీనివాసరెడ్డి, కాశయ్య, వెంకయ్య శ్రీ వివేకానంద యూత్ కార్యకర్తలు మామిడి కాశయ్య, బాలేబోయిన నరేష్, గోపి, న్యాయనిర్ణేతలు గజ్జెల శ్రీను,  మీరా చాంద్,  తెలగమల శ్రీను,  తదితరులు పాల్గొన్నారు.