హాజీపూర్ పీహెచ్‌సీలోప్రత్యేక వైద్య శిబిరం
11-03-2026 01:20 AM
హాజీపూర్, మార్చి 10: ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ సీ)లో మంగళ వారం నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని సర్పంచి మాధవరపు శ్రీలత రామారావు, వైద్యాధికారి డాక్టర్ లహరితో కలిసి ప్రారంభించారు. నిపుణులైన 8 మంది స్పెషలిస్ట్ వైద్యులతో నిర్వహించిన వైద్య శిబిరాన్ని జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అప్పల ప్రసాద్ సందర్శించి తగు సూచనలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓం ప్రకాష్, డాక్టర్ షబ్బీర్ అహ్మద్, డాక్టర్ కీర్తి, డాక్టర్ విక్రమ్, డాక్టర్ ప్రతాప్, డాక్టర్ శిల్ప, సిహెచ్‌ఓ లింగారెడ్డి రఘుపతి, సూపర్ వైజర్లు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, డెమో బుక్క వెంకటేశ్వర్లు, ఆరోగ్య సిబ్బంది సత్యం, పద్మ తదితరులు పాల్గొన్నారు.




