11 March, 2026 | 5:08 PM

కొండాపూర్ హెడ్మాస్టర్ సస్పెన్షన్

11-03-2026 01:21 AM

నిర్మల్, మార్చి 10 (విజయక్రాంతి): నిర్మల్ మండలంలోని కొండాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి హెడ్మాస్టర్ విజయభాస్కర్‌ను సస్పెండ్ చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన తెలిపారు.

పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హెడ్మాస్టర్ మన ఊరు మనబడి నిధుల దుర్వినియోగం, తల్లిదండ్రులు విద్యార్థులలకు అనుచితంగా మాట్లాడడం, పాఠాలు బోధించకుండా నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడంపై ఫిర్యాదు వచ్చినట్టు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం విద్యాశాఖ అధికారితో విచారణ జరిపి వారిచిన నివేదిక ఆధారంగా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్టు ఆయన వివరించారు.