calender_icon.png 11 February, 2026 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల బస్సులపై ప్రత్యేక తనిఖీలు

11-02-2026 01:31:00 AM

ముల్కనూర్ ఎస్‌ఐ రాజు

భీమదేవరపల్లి ,ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) విద్యార్థుల బంగారు భవిత దృష్టిలో పెట్టుకొని పాఠశాల బస్సులను తప్ప కుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రతినిత్యం బస్సులను తనిఖీ చేయడం జరుగు తుందని ముల్కనూర్ ఎస్త్స్ర ఎం. రాజు తెలిపారు. మంగళవారం ముల్కనూరులో వివిధ పాఠశాలలకు చెందిన బస్సులను ప్రత్యేకంగా తనిఖీ నిర్వహించారు .

ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం తప్పకుండా బస్సులను వాహన బీమా కలిగి ఉండాలని, అలాగే ప్రతి బస్సులో అత్యవసర ప్రథమ చికిత్స బాక్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. డ్రైవర్లు తప్పకుండా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు బస్సు ఎక్కే సమయంలో దిగే సమయంలో తప్పకుండా ఒకరిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇకపై నిత్యం బస్సులను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.