9వ నిజాం రౌనక్ యార్‌ఖాన్‌కు ప్రత్యేక ఆతిథ్యం
న్యూఢిల్లీలో హై-లెవల్ డిప్లొమాటిక్ విందు
పాల్గొన్న 9వ నిజాం రౌనక్ యార్‌ఖాన్
హైదరాబాద్, ఏప్రిల్ 9(విజయక్రాంతి): ఆసఫ్ జాహీ వంశానికి చెందిన 9వ నిజాం హిజ్ హైనెస్ రౌనక్ యార్ ఖాన్ బుధవా రం న్యూఢిల్లీలోని స్పానిష్ రెసిడెన్స్‌లో స్పెయిన్ రాయబారి హి.ఇ. జువాన్ మార్చ్ ఆంటోనియో ఆతిథ్యమిచ్చిన అధికారిక విం దులో పాల్గొన్నారు.
ఈ విందు యునైటెడ్ నేషన్స్ అలయన్స్ ఆఫ్ సివిలైజేషన్స్ (యూఎన్‌ఏఓసీ) హై రిప్రెజెంటేటివ్ హి.ఇ. మిగెల్ ఆంజెల్ మొరాటినోస్ గౌరవార్థం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి దౌత్య, సాంస్కృతిక, రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై, అంతర్జాతీయ సహకారం, గ్లోబల్ అంశాలపై చర్చించారు. హి.హెచ్. రౌనక్ యార్ ఖాన్‌కు ప్రత్యేక గౌరవం కల్పించగా, హై రిప్రెజెంటేటివ్ కుడి వైపున ఆసనం కల్పించడం ఆయన ప్రాధాన్యతను ప్రతిబింబించింది.




