22ఏపై ప్రత్యేక దృష్టి
- కాల్‌సెంటర్ ఫిర్యాదులపై తక్షణ స్పందన
- పరిష్కారం వరకు పర్యవేక్షణ
- ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగొద్దు
- అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
- ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ ఫెయిల్
- హరీశ్ రావు మాటలు.. హంతకుడే సంతాపం తెలిపినట్టున్నాయని విమర్శ
హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి) : 22ఏ నిషేధిత భూముల సమస్యను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని వేగంగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను మంత్రి పొంగులే టి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకొని, పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించాలని సూ చించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. నిషేధిత జాబితా వ్యవహారంలో ప్రజలు ఆందోళన చెందవద్దని, నిజమైన హక్కుదారులకు ప్రభు త్వం అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇ చ్చారు.
22ఏ ఫిర్యాదుల కాల్ సెంటర్‌కు వస్తు న్న కాల్స్, వాటి పరిష్కారానికి తీసకుంటున్న చర్యలపై మంత్రి పొంగులేటి బుధవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నాలుగు జిల్లాల్లో 22ఏ అంశంపై ప్రస్తుత పరిస్థితి, దరఖాస్తుల వివరాలను అధికారులను అ డిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 400 కాల్స్ వచ్చినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేసి వదిలేయకుండా, దరఖాస్తుదారుడి పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు సంబం ధిత తహసీల్దార్, ఆర్డీవో, సబ్‌రిజిస్ట్రార్ తదితర అధికారులకు పంపించాలని ఆదేశించారు.
సమస్య పరిష్కారమయ్యే వరకు నిరంతరం పర్యవేక్షించాలని, కాల్ సెంటర్ నుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు స్వీకరించిన అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదు పై నిజానిజాలను నిర్ధారించి, దరఖాస్తుదారు పేర్కొన్న సమస్య వాస్తవమా? భూమి 22ఏ జాబితాలోకి ఎందుకు వచ్చింది? దరఖాస్తుదారుడికి అర్హత ఉందా? అనే అంశాలను క్షేత్రస్థా యిలో సమగ్రంగా పరిశీలించాలని, అనంతరం స్పష్టమైన కారణాలతో నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.
ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్ల స్థాయిలో పెండింగ్ ఉన్న వాటితో పాటు కొత్తగా వచ్చిన దరఖాస్తులను ప్రత్యేక టాస్క్‌గా తీసుకుని ఎప్పటికప్పు డు పరిష్కరించాలని ఆదేశించారు.
తరాలు తిన్నా తరగని డబ్కెక్కడిది?
22ఏ జాబితాలో భూముల తొలగింపునకు కమీషన్లు తీసుకుంటున్నారని, అవినీతి జరుగుతుందని హరీశ్‌రావు వ్యాఖ్యలు చేయటం విడ్డూరంగా ఉందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. హరీశ్ మాటలు వింటుంటే, హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. నిషేధిత భూముల వ్యవహారంలో మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణలకు మం త్రి గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతి గురించి స్వయంగా మీ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత గతంలో చేసిన వ్యాఖ్యలను హరీ శ్ రావు మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. అవినీతిపై హరీశ్ నీతి వ్యాక్యాలు చెబుతుంటే బీఆర్‌ఎస్ నేతలే నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు.
రబ్బరు చెప్పులతో తిరిగిన అగ్గిపెట్టె రావు.. పదేళ్లలో విచ్చలవిడిగా దోచుకుని తరతరాలకు తిన్నా తరగని డబ్బు సంపా దించుకున్నారని ఆరోపించారు. మీ ఆర్థిక పరిపుష్టికి అవినితే కదా ఆధారమని నిలదీశారు. అధికారం లో ఉన్నప్పుడు ఏం కష్టపడ్డారు? ఎలాంటి వ్యా పారం చేశారు? అంత తక్కువ సమయంలో ఎ వరికీ సాధ్యం కానంత డబ్బు ఎలా సంపాదించారు? ఆ రహస్యం ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు అన్నింటిలో నూ దోచుకున్న బీఆర్‌ఎస్ నేతలు..
ఇప్పుడు క మీషన్ల ప్రభుత్వం అంటూ మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వంలో నూ అక్రమాలు జరుగుతాయనుకోవడం వారి భ్రమేనని, ప్రజలపై రుద్దవద్దని హితవు పలికారు. ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ ఫెయిల్ అని మంత్రి విమర్శించారు. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా, అబద్ధాలను పదేపదే చెబుతూ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తుందని మండిపడ్డారు. ప్రతి అంశాన్ని రాజకీయం గా వాడుకోవడం బీఆర్‌ఎస్‌కు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.






