టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ల విడుదల
21-08-2026 01:19 AM
బాన్సువాడ, ఆగస్టు 20 (విజయ క్రాంతి): TSCPSEU ఆధ్వర్యంలో CPS రద్దు కోసం చేపట్టిన కార్యక్రమం ’ఛలో హైదరాబాద్ ’ లో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఈనెల 23 వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారంTSCPSEU ఆధ్వర్యంలో కాంప్లెక్స్ సమావేశం విరామం సమయం లో ఆవిష్కరిచండం జరిగింది. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఈ భారీ బహిరంగ సభ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో ప్రధాన ఉపాధ్యాయులు వెంకట రమణ,ఉపాధ్యాయులు నక్క ప్రవీణ్, ఆనంద్, సాయిరాం, మహేందర్, సంపత్, సంతోష్, ప్రసన్న లత, చైతన్య, రజిత, గంగామణి,శ్రీకాంత్ రెడ్డి, గీతాంజలి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






