12 June, 2026 | 2:49 AM

దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి

12-06-2026 12:38 AM

మహబూబాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్య త ఇస్తోందని, అలాగే అర్చకుల సంక్షేమానికి కూడా తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, అర్చకుల వేతనాల పెంపు, ఇతర సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తామని మహబూబాబా ద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. గురువారం మహబూబాబాద్ అ నంతాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంలోధూప దీప నైవేద్య అర్చక సంఘం సర్వసభ్య సమావేశం అధ్యక్షులు వెంకటేశ్వర చారి ఆ ధ్వర్యంలో నిర్వహించారు.

నిర్వహించడం జ రిగింది. ఈ సందర్భంగా అర్చకులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో అర్చక భవన్ కోసం కలెక్టర్ తో మాట్లాడి తగిన స్థలం  ఏర్పాటు చేస్తానని చెప్పారు. ధూప దీప నైవేద్య అర్చకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసు వాసు దేవ శర్మ, వరంగల్ జిల్లా సహాయ కమిషనర్ రామల సునీత చేతుల మీదుగా అర్చకు లకు గుర్తింపు కార్డులను అందజేశారు.