11 March, 2026 | 6:09 AM

పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

09-03-2026 01:52 AM

నిర్మల్, మార్చి 8 (విజయక్రాంతి): విద్యా వ్యవస్థలో నిర్మల్ పట్టణంలో ఉన్నతమైన హంగులతో పాఠశాలలు ఉన్నాయని ప్రతి ఒక్కరు పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ద చూపాలని మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య సూచించారు.  నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాసవి పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆమె ప్రారంభించారు.

పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ప్రదర్శన, వైద్యాశిభిరం, మహిళల ఏర్పాటు చేసిన క్రీడలను సందర్శించారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు, డాక్టర్‌లతో కలిసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి సెల్ఫీలు దిగి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వినీశ, రేజొనేన్స్ ప్రిన్సిపాల్ లావణ్య,  వాసవి పాఠశాల నిర్వాహకులకు ముత్యం రెడ్డి, జగదీశ్ రెడ్డి, పోతారెడ్డి పాల్గొన్నారు.