ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
ప్రజావాణిలో 80 దరఖాస్తులు స్వీకరణ
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, మార్చి 9(విజయక్రాంతి): ప్రజావాణి అర్జీల పై ప్రత్యేక శ్రద్ధ అవసరమని పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి హాలులో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి 80 వినతుల స్వీకరించారు. గతవా రం ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యలపై శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు స్వీకరించిన ఆర్జీలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని, క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను వెంటనే పరిశీలించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం అధికారులతో ప్రజావాణి అర్జీలపై, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులందరూ క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించాలని, అభివృద్ధి పథకాలపై స్పష్టమైన నివేదికలు అందజేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని సహించమని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. శాఖల వారీగా పనితీరు మరింత మెరుగుపడే దిశగా పటిష్ట కార్యచరణ ద్వారా ముందుకు పోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో.. అదనపు జిల్లా ఎస్పీ ఎస్. మహేందర్
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావా ణి కార్యక్రమంలో అదనపు జిల్లా ఎస్పీ ఎస్. మహేందర్ ప్రజల నుండి పిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని పలు గ్రామాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు, వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను అదనపు ఎస్పీకి నేరుగా వివరించారు. ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదుదారునితో అ దనపు ఎస్పీ వ్యక్తిగతంగా మాట్లాడి, వారి స మస్యలను వివరంగా తెలుసుకున్నారు.
అందిన పిర్యాదులను క్షుణ్నంగా పరిశీలించి, సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్‌ఇన్స్పెక్టర్లకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని కేసుల విషయంలో సంబంధిత ఎస్హెచ్‌ఓలతో ఫోన్లో మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారమై, ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం మరింత పెరుగుతోందని అదనపు ఎస్పీ పేర్కొన్నారు.




