16 August, 2026 | 3:17 AM

ఆసీస్ రికార్డు స్పెయిన్ బ్రేక్

16-08-2026 12:37 AM

దుబాయి, ఆగస్టు 15: ఆస్ట్రేలియాకు ఖాతాలో ఉన్న ఓ అరుదైన ప్రపంచ రికార్డు బద్దలైంది. అదికూడా స్పెయిన్ లాంటి చిన్న జట్టు ఆసీస్ రికార్డును బ్రేక్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో వరుసగా అత్యధిక విజయాలు(21) సాధించిన జట్టుగా స్పెయిన్ చరిత్రకెక్కింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పేరిట ఉన్న గత వరల్ రికార్డును బద్దలు కొట్టింది. కాగా రికీ పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2003లో వరుసగా 20 విజయాలు నమోదు చేసింది. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2028 సబ్ రీజనల్ యూరప్ క్వాలిఫయర్- ‘సి’లో భాగంగా.. ఫిన్లాండ్తో స్పెయిన్ తలపడింది. ఈ మ్యాచ్లో ఫిన్లా్ంప ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ఆ రికార్డును దాటేసింది.