ఘనంగా సోయం గంగులు 75వ వర్ధంతి
దమ్మపేట,(విజయక్రాంతి): మంగళవారం దమ్మపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సోయం గంగులు విగ్రహానికి 75వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జిల్లా బీఆర్ఎస్ నాయకులు సోయం వీరభద్రం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోయం వీరభద్రం మట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం లో దున్నే వారికే భూమి దక్కాలి అనే నినాదం తో సిఎం గంగులు పోరాటం చేశారని,
సోయం గంగులు చెసిన ఘనమైన చరిత్రనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయనీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఆదివాసి ఎమ్మెల్యేలు సోయం గంగులు స్మారక స్థూపం నిర్మాణం కోసం చొరవ చూపాలని, జాతి నాయకులు పేర్లు చెప్పి ఓట్లు కోసం వాడుకోవడం సరియైన పద్ధతి కాధని, సోయం గంగులు ఆశాయల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో ఆదివాసి సీనియర్ నాయకులు సోయం రామ్మూర్తి, ఉమా మహేశ్వరరావు, కీసరి మల్లికార్జునరావు పలువురు ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.






