కపిలేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు
12-05-2026 04:15 PM
- స్వామివారిని దర్శించుకున్న యాదగిరి సునీల్ రావు
ముకరంపుర,(విజయ క్రాంతి): పెద్ద హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని కాశ్మీర్ గడ్డలో వెలసిన ప్రసిద్ధ శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వయంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






