17 March, 2026 | 6:32 AM

త్వరలో జిల్లాకో స్పోక్స్ పర్సన్!

17-03-2026 01:22 AM
  1. స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు సమన్వయానికి ఏర్పాటు
  2. స్పోక్స్ పర్సన్లకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు దిశానిర్దేశం

హైద్రాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. క్షేత్రస్థా యిలో పార్టీ గొత్తును బలంగా వినిపించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి జిల్లాకు ఒక అధికార ప్రతినిధిని నియమించనున్నట్టు సమాచారం. స్థానికంగా ఉండే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటిపై పార్టీ వైఖరిని ప్రజ ల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ భావిస్తున్నది.

సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధు లతో అధ్యక్షుడు రాంచందర్‌రావు భేటీ అ య్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై వారికి దిశానిర్దేశంచేశారు. ఆయా జిల్లాల్లో ఏం జరిగిందనే విషయంపై పూర్తిస్థాయిలో క్లారిటీ లేకపోవడంతో ప్రజల్లో పార్టీ గొత్తును వినిపించడంలో వెనుకంజలో ఉంటున్నామని గుర్తించి.. జిల్లాకో స్పోక్‌స పర్సన్‌ను ని యమించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ప్రతినిధులు ఎవరూ తమ వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ అభిప్రాయా లుగా చెప్పకూడదని, కచ్చితంగా పార్టీ లైన్‌కు అనుగుణంగానే మాట్లాడాలని రాంచందర్‌రావు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ఏది పడి తే అది మాట్లాడి పార్టీకి ఇబ్బంది కలిగించవద్దని, క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు ఉం టాయని హెచ్చరించినట్టు తెలిసింది.

ఇప్పటికే రాష్ట్రస్థాయిలో మీడియా ప్యానలిస్టులు, సెల్ కన్వీనర్ల నియామకం పూర్తయిందని, త్వరలోనే జిల్లాస్థాయి నియామకాలు కూడా పూర్తి చేస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యూహం ద్వారా రాబోయే స్థానిక సం స్థల ఎన్నికల్లో పార్టీని మరింత సమర్థవంతం గా సిద్ధం చేయాలని బీజేపీ యోచిస్తున్నది.