సోనాల మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి
15-07-2026 02:33 PM
బోథ్, జులై 15(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్(Telangana Public School ) ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ . రాజర్ సిష గ్రామస్తులు బుధవారం వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గంలో 10 మండలాలు ఉండగా జూనియర్ కళాశాల లేని ఏకైక మండలం సోనాల అని కలెక్టర్ విన్నవించారు పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు జూనియర్ కళాశాల లేక చదువులకు దూరం అవుతున్నారన్నారు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులకు గురవుతున్నారని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు ఈ విషయమై కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు






