అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ
28-08-2026 04:43 PM
మెట్ పల్లి,(విజయక్రాంతి): అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచేది రాఖీ పౌర్ణమి అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. శుక్రవారం రాఖి పండుగను పురస్కరించుకుని ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే సంజయ్ కు ఆయన సోదరి డా.సమత రాఖీ కట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.రాఖీ పండుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుందని, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ పవిత్రమైన రోజున ప్రతి కుటుంబంలో ఆనందం, సంతోషం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఎమ్మెల్యే సంజయ్ కోరారు.






