21 August, 2026 | 1:30 AM

సింధు, ఆయుష్ శెట్టి ఔట్

21-08-2026 12:20 AM

ప్రీ క్వార్టర్స్‌లో ఓటమి

క్వార్టర్ ఫైనల్లో గాయత్రి, ట్రీసా జోడీ

సాత్విక్, చిరాగ్ జోడి ముందంజ

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్ షిప్

న్యూ ఢిల్లీ, ఆగస్టు 20: సొంత గడ్డపై జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు వరుస షాకు లు తగిలాయి. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్‌లో భారత్ టైటిల్ ఆశలకు తెరపడింది. స్టార్ షట్లర్లు పీవీ సింధు, ఆయు శ్ శెట్టి ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. సింధు చైనా కు చెందిన వాంగ్ జి యీ చేతిలో ఓడిపోయింది. చైనా షట్లర్ విజయం సాధించింది. తొలి గేమ్‌లో సింధు 11- ఓడిపోయింది. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న భారత స్టార్ 21- గేమ్‌ను సొంతం చేసుకుని మ్యాచ్‌లో ఉత్కంఠ పెంచింది.

నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇరువురు హోరాహోరీగా తలపడినా.. చివరికి వాంగ్ జి యీ 21 గేమ్‌ను గెలుచు కుని క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన 11వ సీడ్ అల్వీ ఫర్హాన్ చేతిలో 19- 11- వరుస గేముల్లో ఓటమిపాలయ్యాడు. ఇదిలా ఉంటే మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ- గాయత్రి గోపి చంద్ సంచలనం సృ ష్టించారు. రౌండ్ ఆఫ్ 16లో జపాన్ జంట రెన్ ఇవానగాకీ నకనిషిపై 21 21 తేడాతో వరుస గేమ్‌లో విజయం సాధించి క్వా ర్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు.