ఆర్టిసి బస్సుల ఇష్టారాజ్యం
స్టేజిపై ఆగకుండా ప్లై ఓవర్ బ్రిడ్జిపైనే వెళుతున్న వైనం
నిజాంసాగర్,(విజయక్రాంతి): ప్రతి స్టేజి వద్ద బస్సులు అపి ప్రయాణికులను ఎక్కించుకోవాల్సిన ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఇస్టారీతిన వ్యవహరిస్తున్నారు. జుక్కల్, బిచ్కుంద, బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రతి బస్సు నిజాంసాగర్ మండలంలోని నరసింగరావు పల్లి చౌరస్తా వద్ద ఫ్లేవర్ బ్రిడ్జి కింద నుండి వెళ్లి ప్రయాణికులను ఎక్కించుకోవలసి ఉండగా అవేమి పట్టినట్టుగా ఆర్టీసీ బస్సు డ్రైవర్లు బస్సులను డైరెక్ట్ గా ఫ్లై ఓవర్ పైనుండే తీసుకెళుతున్నారు.
దీనివల్ల నిజాంసాగర్, ఎల్లారెడ్డి,మహమ్మద్ నగర్ నుండి, జోగిపేట సంగారెడ్డి పటాన్చెరు వెళ్లే ప్రయాణికులు నరసింగరావుపల్లి స్టేజి వద్ద వేసి చూస్తారు. వీరిని పట్టించుకోకుండా డైరెక్ట్ గా బస్సులు వెళ్లి పోతుందటం తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో ప్రతి బస్సు నిజాంసాగర్ ప్రయాణ ప్రాంగణానికి వచ్చి తిరిగి వెళుతుండేది. జాతీయ రహదారి ప్రారంభమవడంతో అదే అదునుగా భావించిన ఆర్టీసీ అధికారులు ప్రతి బస్సును డైరెక్టర్గా హైవేపైనుండే తీసుకెళ్తున్నారు.
ఇప్పుడు కనీసం స్టేజ్ వద్ద ఆపకుండా ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కండక్టర్లు ఇష్టా రీతిన వ్యవహరించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇకనైనా ఆర్టీసీ అధికారులు స్పందించి హైదరాబాద్ వెళ్లే ప్రతి ఒక్క బస్సును నర్సింగరావు పల్లి చౌరస్తా వద్ద బ్రిడ్జి కింది నుండి వెళ్లే విధంగా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.






