5 May, 2026 | 8:44 PM

Breaking News

నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రజాపండరి   •   భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి   •   కూలీల సమీకరణను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలి   •   మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •  

ఐటమ్ సాంగ్‌తో శ్రష్టి ఎంట్రీ

17-02-2026 12:00 AM

ప్రముఖ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఓ ఐటెం సాంగ్‌తో వెండితెర ప్రేక్షకులను పలకరించనున్నారు. జై జ్ఞానప్రభ తోట దర్శకత్వంలో మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న పొలిటికల్ ఎంటర్‌టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’. సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో ‘న్యాయం చేయరా దేవుడా..’ అంటూ సాగే ప్రత్యేక గీతంలో శ్రష్టి వర్మ అలరించనున్నారు.

ఈ పాటను మేకర్స్ ఈ వారంలోనే విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జై జ్ఞానప్రభ మాట్లాడుతూ.. “ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రాన్ని ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. ప్రముఖ డ్యాన్సర్ శ్రష్టి వర్మ ఈ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.. ఓ ఐటెం సాంగ్‌తో ఆమె సిల్వర్ స్క్రీన్‌కు ఎంట్రీ ఇస్తున్నారు” అని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రానికి డీవోపీ: వెంకట హనుమ; ఎడిటింగ్: సాయిబాబు తలారి; ఆర్ట్: భార్గవాచారి నౌండ్ల.