calender_icon.png 17 February, 2026 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందమే అప్పగించాలా..

17-02-2026 12:00:00 AM

మలయాళ హీరో ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కాటాలన్’. కొత్త దర్శకుడు పాల్ జార్జ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి షరీఫ్ ముహమ్మద్ నిర్మాత. దుషార విజయన్, కబీర్ దుహాన్ సింగ్, రాజ్ తరందాసు, పార్థ్ తివారీ, జగదీష్, సిద్ధిక్, వ్లాగర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రసిద్ధ ఏనుగు పాంగ్ ఈ చిత్రంలో భాగమైయింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘పుష్ప’, ‘జైలర్’ వంటి చిత్రాలతో ఇప్పటికే మలయాళీ ప్రేక్షకులకు సుపరిచితుడైన తెలుగు స్టార్ సునీల్ ఈ తాజా గీతంలో డ్యాన్స్‌తో అదరగొట్టారు. ‘మజాకో మల్లికా’ అనే ఈ ఐటం సాంగ్ మలయా ళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది.

‘కలబడు కసే ఉన్నా.. అడవి పులై వస్తావా.. రణముకి రాజాలాగా దూసుకొచ్చేయ్‌వా.. రగిలే రావణలాగా రెచ్చగొట్టేస్తుం టావా.. జోరుగ ఎర్రటి కళ్లే ఎగరేసెయ్‌వా.. కదిలే కాలయముడివా.. నడిచే క్రూరమృగమువా.. భయముతో నాలుగు దిక్కులు అదిరిపడే వీరుడివా.. మైకంలోన ముంచా లా.. అందమే అప్పగించాలా.. వస్తే రాజసభ మందిరమే మెరిసెనిలా..’ అంటూ సాగుతోందీ పాట. అజనీష్ స్వరపరిచిన ఈ పాటకు తెలుగు సాహిత్యాన్ని రాంబాబు గోసాల అందించారు. ఆనంద్ శ్రీరాజ్, భద్ర పాడారు. మే 14న వివిధ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి డీవోపీ: చంద్రు సెల్వరాజ్; ఎడిటర్: షమీర్ ముహమ్మద్; ప్రొడక్షన్ డిజైన్: సునీల్ దాస్.