3 May, 2026 | 2:29 PM

చదువులో రాణిస్తున్న విద్యార్థినులకు సన్మానం

03-05-2026 01:09 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ లో నివసిస్తు, లైన్ మెన్ గా ఉద్యోగం చేస్తున్న అరెపెల్లి శ్యామయ్య- మంజుల దంపతుల కూతుర్లు చదువులో రాణిస్తున్నారు, ఇటీవల వచ్చిన ఇంటర్ ఫలితాల్లో ఆరేపెల్లి మధులిక 970 మార్కులు తెచ్చుకొని టాపర్ గా నిలిచింది. అదేవిధంగా చిన్న కూతురు ఆరెపల్లి లిఖిత పదవ తరగతి ఫలితాల్లో 559 తెచ్చుకొని టాపర్ గా నిలిచింది. వీరి ప్రతిభ ను గుర్తించి బహుజన లాయర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు, రాష్ట్ర అధ్యక్షుడు బిరుదుల ప్రవీణ్ కుమార్ సన్మానం చేసి భవిష్యత్ లో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు, ఆడపిల్లల చదువే దేశ అభివృద్ధి కి దిక్సూచి అని తెలిపారు.