3 May, 2026 | 2:29 PM

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

03-05-2026 01:12 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్లో పట్టపగలే కాల్పుల కలకలం రేగింది. జ్యోతినగర్ లోని పీఎంజే జ్యువెలరీ షాపులో తుపాకులతో ఐదుగురు దొంగలు చొరబడ్డారు. షాపులోని నలుగురి సిబ్బందిపై కాల్పులు జరిపిన దొంగలు.. భారీగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దొంగలు షాపులో 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం.బీహార్ ముఠా న లేక అంతర్రాష్ట్ర దొంగల పనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ఎం పి కార్యాలయం కు సమీపంలో ఈ ఘటన జరగడం కలకలం రేపింది.