calender_icon.png 20 February, 2026 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి

20-02-2026 02:14:44 AM

మేడ్చల్ అర్బన్ ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మేడ్చల్ కార్పొరేషన్ సర్కిల్ పరిధిలో గల,గిర్మాపూర్. మునీరాబాద్ పట్టణాలలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి పార్లమెంటు బిజెపి అభ్యర్థి మాజీ మంత్రి వర్యులు ఈటల రాజేందర్ పాల్గొని విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరఠాల ప్రజల కోసం చత్రపతి శివాజీ ప్రాణాలను సైతం లేక చేయకుండా పోరాటం చేశారని ఈటల కొనియాడారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్.బీజేపీ రాష్ట్ర నాయకులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి.మేడ్చల్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి.మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్ సీనియర్ నాయకులు సముద్రాల కృష్ణగౌడ్.సింగిరెడ్డి నరేందర్ రెడ్డి.

మేడ్చల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సిహెచ్ రమేష్.బిఆర్‌ఎస్ పార్టీ మాజీ గ్రంథాలయ చైర్మన్ బి భాస్కర్ యాదవ్.మాజీ ఎంపీటీసీ రాజిరెడ్డి.వంగేటి హనుమంత రెడ్డి. శ్రీనివాస్ గౌడ్.సత్యనారాయణ.భూపాల్.రాఘవరెడ్డి.బాల్ రెడ్డి.సత్య వేణు. మల్లారెడ్డి. శ్రీనివాస్ రెడ్డి.అననీల్ రెడ్డి.విష్ణు గౌడ్.సురేందర్ రెడ్డి.వెంకటేష్.సందీప్ రెడ్డి.రాగం ఆనంద్. కార్తీక్ రెడ్డి.ప్రవీణ్.దాసు తదితరులు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరంతో దేశభక్తి చాటిన నాయకులు

ఘట్ కేసర్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): మహా వీరుడు, హిందూ స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గురువారం ఘట్కేసర్ పట్టణంలో బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆ పార్టీ ఘట్కేసర్ మున్సిపల్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గొంగళ్ళ బాలేష్ తో కలిసి పాల్గొన్నారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం దేశభక్తి, ధైర్యం, సనాతన ధర్మ పరిరక్షణకు గొప్ప ఆదర్శమన్నారు. దేశం, ధర్మం, సంస్కృతిని కాపాడటంలో శివాజీ మహారాజ్ చూపిన త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు చలువాది ప్రవీణ్ రావు, నాయకులు పడిగం వీరేష్, ఏనుగు మచ్చెందర్ రెడ్డి, కొత్త బాలుయాదవ్, శోభన్ బాబు, రమేష్ నాయుడు, అనిల్ గౌడ్, గుండె నరేష్, వెంకటేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అమనగల్లులో 

అమనగల్లు, ఫిబ్రవరి 19( విజయక్రాంతి) : హైందవ స్వరాజ్య స్థాపకుడు, ధైర్య సాహసాలకు నిలువుటద్దం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అమనగల్లు పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం అరెకటిక సంఘం అధ్యక్షుడు కామ్లేకర్ సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కేవలం 16 ఏళ్ల ప్రాయంలోనే కత్తి పట్టి, మొఘల్ సామ్రాజ్య పునాదులను కదిలించిన మహావీరుడు శివాజీ అని కొనియాడారు.

భరతజాతిలో కొత్త జవసత్వాలు నింపి, హైందవ ధర్మ రక్షణ కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు.  మాజీ ఓబీసీ సభ్యులు తల్లోజు ఆచారి, అమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ నేనవత్ పత్య నాయక్. కౌన్సిలర్లు మక్తల వెంకటయ్య, ఎర్రవోలు మహేష్, దుడ్డు ఆంజనేయులు, ఏనుముల రమేష్, పుల్లారెడ్డి శ్రీశైలం.శివాజీ పరివార్ సభ్యులు, అరెకటిక సంఘం నాయకులు, బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సురంగల్‌లో 

మొయినాబాద్, ఫిబ్రవరి 19: మొయినాబాద్ మండలంలోని సురంగల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ లో ని 13వ వార్డు కౌన్సిలర్ గడ్డం లక్ష్మి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ దేశభక్తి,ధైర్యసాహసాలు మరియు పరిపాలనా నైపుణ్యం నేటి తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.

యువత ఆయన స్ఫూర్తిని తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో విక్రమ్ రెడ్డి, నరసింహారెడ్డి, అశోక్ గౌడ్, దుర్గం పాండు, వెంకటరెడ్డి, సోమ గోపాల్, కమ్మరి శ్రీనివాస్ చారి, మహేష్, ఇక్బాల్, సాయి తదితరులు పాల్గొని శివాజీ మహారాజ్కు ఘనంగా నివాళులర్పించారు.